ఆదివాసీ హక్కుల సాధన కోసం ఒక్కటైపోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిఅన్నారు. భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ ప్రధాన కూడలిలో కొమురం భీం విగ్రహా ఆవిష్కరణకు శుక్రవారం హజరయ్యారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో కొమురంభీం వర్థంతిని మొదటగా జోడేఘాట్‌లో జరుపుకుంటామన్నారు. ఆదివాసీల్లో తొమ్మిది తెగలు ఉంటాయని, అన్ని తెగలు ఒక్కతాటిపైకి వస్తేనే ఆదివాసీ సమాజం బాగుంటుందన్నారు.