కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కాళేశ్వర క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు చేసిన సలహాలు, సూచనలు మేరకు అభివృద్ధి నివేదికలను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు.