నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు

69பார்த்தது
నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు
వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం స్పీకర్‌ ఓం బిర్లా ఓటింగ్‌ నిర్వహించారు. అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. దీంతో ఇవాళ వక్ఫ్‌ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఇందులో ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం ఉండటంతో బిల్లు పాస్ అవ్వడం లాంఛనమే. ఈ బిల్లుపై చర్చకు ఎగువసభలో 8 గంటల సమయాన్ని కేటాయించారు.

தொடர்புடைய செய்தி