దుద్యాల మండల కేంద్రంలో గురువారం పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నెల 11న అధికారులపై దాడి జరగడం, ఇటీవల నిందితులు జైల్లో నుంచి విడుదల కావడం వంటి నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట ఎస్సై అబ్దుల్ రావుఫ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.