వికారాబాద్ జిల్లా దుద్యాల మండల సమీకృత భవన నిర్మాణానికి ఈ నెల 25వ తేదీన సర్వే చేస్తున్నట్లు తహసీల్దార్ బి. వెంకటేశ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రైతు వేదిక వద్ద ఉన్న 1105 సర్వే నంబర్ లో ఉన్న స్థలంలో సర్వే చేపడుతున్నామని చెప్పారు. సమీపంలో భూములు కలిగిన రైతులకు తమ అభ్యంతరాలను సంబంధిత పత్రాలతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేయాలని ఆయన సూచించారు.