కొడంగల్ నియోజకవర్గ కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్ పేట గ్రామంలో ప్రజల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో పక్షుల కళేబరాలు గురువారం దర్శనమిచ్చాయి. కలుషితమైన నీరు తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి వాటర్ ట్యాంక్ శుభ్రం చేయించాలని కోరుతున్నారు. అలాగే ట్యాంక్ పై మూతలను ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.