కేటీఆర్ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పరిగి పట్టణంలోని బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు.