లగచర్ల ఘటనలో ఏ1 గా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఉన్నతాధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి అసలు భూమే లేదు అన్నారు. కొందరికి భూమి ఉన్నా, భూసేకరణ పరిధిలోకి రాదు అన్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది అన్నారు.