బన్సీలాల్ పేట డివిజన్ సత్వ నెక్లెస్ ప్రైడ్ గేటెడ్ కమ్యూనిటీ సముదాయంలో ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు సిటీలో 40 ఓపెన్ జిమ్ లు ప్రారంభించినట్లు చెప్పారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కోసం జిమ్ లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నిత్య కార్యక్రమాల్లో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు.