ఒకవైపు మార్కింగులపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంటే.. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాలపై హైడ్రా దూసుకుపోతుంది. శని, ఆదివారాల్లో 14 టీమ్లతో హైడ్రా కూల్చివేతలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా పూర్తి పకడ్బందీ ప్రణాళికతో, భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలకు బుల్డోజర్లు సిద్ధం చేశారు.