ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని ప్రోత్సహించడమే ప్రపంచ హృదయ దినోత్సవ ఉద్దేశం. ఇంకా ఈ రోజున ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని.. గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొంటారు.