TG: అవిభక్త కవలలు వీణ-వాణీ 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. బుధవారం 22వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇద్దరు అవిభక్త కవలలను విడదీయాలని ప్రభుత్వాలను, వైద్యులను వేడుకుంటున్నా ఫలితం లేదని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టినప్పటి నుంచి 13 ఏళ్ల దాకా నీలోఫర్ ఆసుపత్రి వారికి అండగా నిలిచింది. తర్వాత స్టేట్ హోంకు తరలించారు. అక్కడే.. వీణవాణీలు డిగ్రీ సీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు.