ఓ మహిళ తన ఇంటి తలుపును తాళం చెవితో తెరవగా ఇంటి గుమ్మం వద్ద పులి నిలబడి ఉంది. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. మరుసటి సెకనులో పులి ఆ మహిళపై దాడికి దిగుతుంది. అయితే అప్పటికే ఆ మహిళ తేరుకుని వెంటనే తలుపులు మూసేసింది. తద్వారా ఆమె పులి బారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.