హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో టికెట్ ధరలు పెరగనున్నాయి. తాజాగా పెంచిన కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ జె.వసంత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూపార్క్ సందర్శనకు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. ఫోటో కెమెరాకు రూ.150, వీడియో కెమెరా రూ.2500, ట్రైన్ రైడ్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40లుగా నిర్ణయించారు.