తెలంగాణలో మళ్లీ పార్టీ ఫిరాయింపులు మొదలయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుతో కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు అని ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చేరికల స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.