తన తల్లికి చికిత్స సరిగా చేయలేదనే కోపంతో జగన్మాథన్ అనే వైద్యుడిపై 26ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. క్యాన్సర్ చికిత్స తీసుకున్న తన తల్లి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బుధవారం ఉదయం ఆసుపత్రికి పేషంట్గా వచ్చిన సదరు యువకుడు, డాక్టర్ ఛాతీ భాగం, ముఖంపై 7 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం కత్తి పడేసి బయటకు వెళ్తుండగా వైద్య సిబ్బంది అతడిని పట్టుకుంది.