మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే రైస్ స్కామ్ జరిగిందని TPCC చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రూ. వేల కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. గతంలో దండుకున్న డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అని ప్రశ్నించారు. గతంలో రైస్ మిల్లర్లు బియ్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. బయటకు అక్రమంగా తరలించిన దొడ్డు బియ్యంపై విచారణ చేయిస్తామని వ్యాఖ్యానించారు.