ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ‘దేవర’ సినిమా నిర్మాత క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా సక్సెస్ మీట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ నిర్మాత నాగవంశీ ఒక పోస్ట్ పెట్టారు. ఈ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ అనుమతులు లభించలేదని తెలిపారు. సక్సెస్ మీట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరారు. దేవరని ఈ స్థాయిలో ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.