భారతీయ సంప్రదాయంలో పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరుడు వధువును చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. వేదికపైకి వచ్చిన వధూవరుల మధ్య తెరగా పెద్దలు ఓ గుడ్డను ఉంచారు. పురోహితుల సలహా మేరకు వారు ఆ తెరను తీయగానే తన అందమైన కాబోయే భార్యపై వరుడు పూలు చల్లాడు. అనంతరం తన జీవితాంతం తోడుగా ఉండబోయే భార్యను చూస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.