విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కలిసి జంటగా నటిస్తోన్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. కాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ..ఈ సంక్రాంతి వస్తున్నాం మూవీ మాములుగా ఉండదని, ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఈ మూవీ ఈనెల 14న రిలీజ్ కానుంది.