ప్రగ్యా జైస్వాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2021లో బాలయ్యతో అఖండ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే జనవరి 12న ఆమె పుట్టినరోజు కాగా..అదే రోజు బాలయ్యతో కలిసి నటించిన ‘డాకు మహారాజ్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో ప్రగ్యా మాట్లాడుతూ..‘ఈ మూవీలో నటించడం నా అదృష్టం, ఇదే నాకు బాలయ్య ఇచ్చే పెద్ద గిఫ్ట్’ అని తెలిపింది.