ఫ్రాన్స్‌కు చెందిన రక్షణ, విమానయాన కంపెనీ థేల్స్ (Thales) ఢిల్లీలోని గురుగ్రామ్ సమీపంలో అవియానిక్స్ మెయింటెనెన్స్, రిపేర్ & ఓవర్‌హాల్ (MRO) సదుపాయం ఉన్న సెంటర్ ను ప్రారంభించింది. ఇది వాణిజ్య, రక్షణ విమానాల అవియానిక్స్ వ్యవస్థలకు మరమ్మతులు, నిర్వహణ సేవలు అందించడానికి నిర్మించబడింది. భారతదేశంలోని విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం, ఆపరేషన్‌ల సమర్థతను పెంచడం, వేగంగా సేవలు అందించడం దీని లక్ష్యం.