తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తండా వాసులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లీసులు, తండా వాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.