తుంగతుర్తి: దారుణం.. వైద్యం వికటించి బాలిక మృతి
తుంగతుర్తి మండల పరిదిలోని ఏనకుంట తండ గ్రామపంచాయతీలోని బానోత్ రమేష్ అమ్రు వారి కుమార్తే ఐశ్వర్య 10తరగతి చదువుతుంది. అమ్మాయికి రెండు రోజుల క్రితం జ్వరం రావటంతో పక్క గ్రామం అయిన హరిపిరాల ఆర్ యం పి డాక్టర్ సారయ్య దగ్గరికి తీసుకువెళ్లారు. డాక్టర్ సెలెన్ బాటిల్ తో పాటు రెండు ఇంజెక్షన్ ఇవ్వడంతో కడుపు నోప్పితో పాటు వాంతులు చేసుకుంది. దీంతో అమ్మాయి అక్కడికక్కడే చనిపోయిందని బాధిత తల్లిదండ్రులు తెలిపారు.