సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్ లో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామానికి చెందిన గోగుల శేఖర్ రెడ్డి తన ప్రత్యతి కుర్ర గోపి యాదవ్ పై 15 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన గోగుల శేఖర్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఎన్నిక పత్రాన్ని అందుజేశారు.