కోదాడ : మరణించిన తల్లి చితికి నిప్పంటించేందుకు బయలుదేరిన తనయుడు అనంతలోకానికి వెళ్ళారు. సోమవారం తెల్లవారు జూమున తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ దుర్ఘటన చోటు చేసుచేసుకోగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాలయ్యాయి. వివరాల్లోకి వెళితే హైద్రాబాదలో ఇన్ఫోసిస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అరిమిల్లి వెంకట సత్యనారాయణ (32) పశ్చిమ గోదావరి జిల్లా పెనుగోండ మండలం సిద్దాంతం గ్రామంలో ఉంటున్న తన తల్లి మృతిచెందడంతో ఆమెను కడసారి చూసి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఒక్కగానోక్కడైన కొడుకు సత్యనారాయణ, గర్భవతి అయిన అతని భార్య సౌజన్య, మరదలు(భార్య చెల్లెలు)గుల్లపల్లి వెంకటమాధవి(21) హైద్రాబాద్ నుంచి ఆదివారం రాత్రి క్యాబ్ బుక్‌చేసుకుని తమ సోంతూరికి బయలు దేరారు. తెల్లవారు జామున కోదాడ మండలం కొమరబండ సమీపాన జాతీయ రహదారిపై ఉన్న ద్వారాకా హోటల్ వద్ద ఆగిఉన్న లారీని తెల్లవారుజమున గ.3.45ని.. వేగంగా ఢీకొట్టడంతో కారులో ఎడమ వైపు కూర్చున బావ, మరదలు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా క్యాబ్ డ్రైవర్‌కు, సత్యనారాయణ భార్యకు తీవ్రగాయాలయ్యాయి. సత్యనారాయణ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందినప్పటికి మరదలు ఆయిన మాధవి కొనప్రాణంతో ఉంది అంబులెన్స్‌కు సమాచారం అందించి అదిరావడం కొంత లేటు కావడంతో ఆమె కూడా స్పాట్‌లోనే మృత్స్యువాతకు గురైంది. ప్రమాద సంఘటనను తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసులుసంఘటన స్థలానికి చేరుకునిమృతదేహాలను jబయటకు తీసి, క్షతగ్రాత్రలను కోదాడ ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. తీగ్రాయాలైన ఇద్దరిని పమెరుగైన చికిత్సకోసం హైద్రాబాద్ తలరించారు. కాగా మృతదేహాలకుపోస్టుమార్టమ్ నిర్వహించి బంధువులను అప్పటించారు. రూరల్‌సిఐ జి రవి ఆధ్వర్యంలో కేసునమోడు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.