సూర్యపేట మండలం టేకుమట్ల గ్రామం లోని గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ కాలువల ఆక్రమణ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలువల సంరక్షణపై పకడ్బందీ చర్యలు తీసుకుని గ్రామస్తుల నివాసాలకు రక్షణ కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.