మతోన్మాద దోపిడీ విధానాలకు ప్రత్యామ్నాయం మార్క్సిజం, అంబేద్కర్ ఆలోచన విధానాలే అని ఎంసిపిఐ(యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. గురువారం సూర్యాపేటలో మాజీ శాసనసభ్యులు, ఎంసిపిఐ(యు నిర్మాత అమరజీవి మద్ధి కాయల ఓంకార్ 16 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నజీర్, ఇన్చార్జి మట్టయ్య, కేంద్ర సభ్యులు వెంకన్న, పోతుగంటి కాశి జిల్లా సహాయ కార్యదర్శి సోమన్న ఉన్నారు.