పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పత్తి రైతుల సమస్యలపై రిప్రజెంటేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇట్టి సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ ను ఆయన కోరినట్లు తెలిపారు.