సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో డీజేలతో అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు జిల్లా ఇంచార్జీ ఎస్పి శరత్ చంద్ర పవర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక శబ్దాల కారణంగా మానవ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించడం జరిగిందని తెలిపారు.