పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని మండల స్పెషల్ అధికారి డీఎఫ్ఓ సతీష్ కుమార్ తెలిపారు. నడి గూడెం మండల కేంద్రంలోని బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ పాటించాలని
నాసి రకమైన భోజనం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ వాణికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ ఇమామ్ ఉన్నారు.