మునగాల మండల కేంద్రంలోని పలు ఎరువుల, క్రిమిసంహారక మందుల దుకాణాలను కోదాడ డివిజన్ సహాయ సంచాలకులు డి. ఎల్లయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల అమ్మకాల్లో డీలర్లు నాణ్యత పాటించాలని కోరారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవో రాజు ఉన్నారు.