సుమారు రూ 3, 60, 000 విలువ గల కాపర్ వైర్ ను దొంగతనం చేసిన ఐదుగురు నిందితులను మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం కోదాడ డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నిందితులు కొంచెం కోటేష్, రూపాని గోపి, రూపాని నాగయ్య, వరికోప్పల శ్రీను, కొంచెం విజయ్ లను రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.