కోదాడ: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

81பார்த்தது
కోదాడ: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెంలో పోలీసు కళాబృందాల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సురేష్ హోంగార్డు శ్రీకాంత్, కళాబృందం ఇంచార్జ్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி