కమిలేష్‌ చంద్ర పే కమిటి సిఫార్సులను అమలు చేయాలి - జాక్‌కన్వీనర్‌ వెంకటేశ్వర్లు

42பார்த்தது
కమిలేష్‌ చంద్ర పే కమిటి సిఫార్సులను అమలు చేయాలి - జాక్‌కన్వీనర్‌ వెంకటేశ్వర్లు
కోదాడ : కమలేష్‌ చంద్ర పే కమిటి సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సూర్యాపేట జిల్లా గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం జేఎసీ కన్వీనర్‌ మహాంకాళి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శనివారం కోదాడ తపాల కార్యాలయం ముందు గ్రామీణ తపాల ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ తపాల ఉద్యోగులు ఏళ్ళ తరబడి పనిచేస్తున్న కనీస వేతనాలు అందడం లేదన్నారు. గత 5రోజులుగా దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాబోయో రోజుల్లో అమరణ నిరాహార దీక్షలకు సిద్దమవుతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో తాము నిర్వహిస్తున్న పోస్టాఫీసు కార్యాలయాలకు అద్దెలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో అఖిల భారత తపాల ఉద్యోగుల, ఆలిండియా గ్రామీణ డాక్‌ సేవక ్‌యూనియన్‌, నేషనల్‌ యూనియన్‌లకు చెందిన నాయకుల తిరుపతి, దేవవాసి పి వెంకటేవ్వర్లు ఎం వెంకటేవ్వర్లు, జానిపాషా, నాగేశ్వరరావు, మల్లయ్య, రమాదేవి, సిందు తదతరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி