భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ జిల్లా ఇన్చార్జ్గా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కుర్ర గోపి యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మంగళవారం కుర్ర గోపి యాదవ్ నియామక ఉత్తర్వులను జారీ చేసారు. అనంతరం మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కై అనేక పోరాటాలు చేసిన కుర్ర గోపి యాదవ్ నల్గొండ జిల్లా ఇన్చార్జ్గా నియమితులవడం శుభపరిణామం అన్నారు.