HCU భూముల విషయంలో తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో పనులను ఒక్కరోజుపాటు నిలిపివేయాలంటూ హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్‌లను గురువారం మధ్యాహ్నం విచారిస్తామని, అప్పటివరకు పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్థులకు ఊరట లభించింది.