ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీవారి వసంతోత్సవ మండపంలో గత మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చివరి రోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారికి వైదిక పండితులు వసంతోత్సవ సేవ నిర్వహించారు.