బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డిసెంబర్ 21 రాత్రి నుంచి 22 వరకు పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు 416 మందిని అరెస్టు చేశారు. అలాగే 335 కేసులు నమోదు చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తోందని, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఇలాంటి కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని సీఎం హిమంత్ బిశ్వశర్మ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.