బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఈ పండు తినడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణాశయం రోజంతా సజావుగా పనిచేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉండదు. గ్యాస్, చెస్ట్ ఇరిటేషన్ వంటి సమస్యలు దూరమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.