సిరిసిల్ల: నిరుపేదల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి
నిరుపేదలకు అండగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సందెల సతీష్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధిత కుటుంబానికి చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సందెల సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.