వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మేడిపల్లి భీమారం మండల ప్రజల చిరకాల కోరిక కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. రైతుల దశాబ్దాల కాలం నాటి కల నెరవేరిందని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.