సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను దర్శించుకోనున్నారు. అనంతరం రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాజన్న ఆలయం, జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా ఈ నెల 19న సీఎం వరంగల్లో పర్యటించనున్నారు.