పేదల సంక్షేమమే లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని ఆర్ కే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 301 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 80, 58, 000 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 115 మంది లబ్ధిదారులకు రూ. 1, 15, 13, 340 విలువ గల చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప పాల్గొన్నారు.