తెగుళ్ల నివారణపై అవగాహన ఉండాలి: డీఏఓ
తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వరి పొలాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్లు నివారణకు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా వ్యవసాయ అధికారులు సూచించిన మందులను పిచికారి చేసి తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చని అవగాహన కల్పించారు.