పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో రూ. 15 లక్షలతో కంటి ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశామని, శుక్రవారం కంటి శస్త్ర చికిత్సలను ప్రారంభించామని, ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలు వాడుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ థియేటర్ ప్రారంభమైందని, తొలిరోజు విజయవంతంగా 4 కంటి శస్త్ర చికిత్సలు ఆప్తామాలజిస్ట్ వైద్యులు డాక్టర్ సబీహా, డాక్టర్ సింధూర నిర్వహించారన్నారు.