దొరికిన బంగారం పోలీస్ లకు అప్పగించిన కోరుట్ల యువకులు

30782பார்த்தது
దొరికిన బంగారం పోలీస్ లకు అప్పగించిన కోరుట్ల యువకులు
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు లో ఉన్న మణికంఠ వినోద్ ఫోటో స్టూడియో లో పనిచేసే ఎల్ల సాయి, ధామ రాకేష్ లకు సమీపంలోని పాత ఆనంద్ షాపింగ్ వద్ద బుధవారం ఉదయం గులాబి రంగు పర్సు దొరకక దాంట్లో రెండు తులాల నక్లెస్, ఒక తులం బిస్కెట్ బంగారం, వెయ్యి రూపాయలు ఉన్నాయి. ఎవరో పర్సును పోగొట్టుకొని ఉంటారని పర్సును సంబంధీకులకు అప్పగించాలని భావించి తమ ఫోటో స్టూడియో యజమాని చలిగంటి వినోద్ కు విషయం చెప్పగా, ఆయన కోరుట్ల ఎస్ఐ సతీష్ కు సమాచారం ఇచ్చారు. అనంతరం పాత ఆనంద్ షాపింగ్ మాల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి పర్స్ పోగొట్టుకున్న మెట్పల్లి పట్టణానికి చెందిన సంబంధిత వ్యక్తులను గుర్తించి వారికి ఎస్ఐ సతీష్ సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో ధనలక్ష్మి కోరుట్ల పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ ని కలవగా ఆధారాలు పరిశీలించి పర్స్ అప్పగించడం జరిగింది. అనంతరం ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ, తమకు దొరికిన పర్సును బంగారాన్ని నిజాయితీగా వాటి యజమానులకు అందజేయాలని ఆలోచించి తమను సంప్రదించిన ఎల్ల సాయి, దామ రాకేష్ లను అభినందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி