ఆ ఇంటికి కరెంట్ బిల్లు 7 లక్షలు ...

31334பார்த்தது
ఆ ఇంటికి కరెంట్ బిల్లు 7 లక్షలు ...
జగిత్యాల జిల్లా లోని కోరుట్ల పట్టణం లో ఆనంద్ నగర్ కు చెందిన తోకల భీమరజం కు 7 లక్షల కరెంట్ బిల్లు రావడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. శనివారం విద్యుత్ సిబ్బంది వచ్చి బిల్లింగ్ చేయగా మొత్తం 296 యూనిట్లు విద్యుత్ వాడకంలోకి రాగ (7,13,545) 7 లక్షల 13 వేల ఐదు వందల నలభై ఐదు 545 రూపాయల బిల్లు వచ్చినట్లు రశీదు ఇచ్చారు. ఆ బిల్లు చూసిన యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి కాగా ఆదివారం పాత రీడింగ్ యంత్రం తో బిల్లు చేయగా 3500 వచ్చినట్లు తెలిపారు. ఈ విషయం గురించి విద్యుత్ ఏ ఈ శ్యామ్ తో మాట్లాడగా సిబ్బంది నూతన యంత్రం తో బిల్లింగ్ చేయగా తప్పుగా వచ్చిందని పాత రీడింగ్ యంత్రం తో బిల్లు సరి చేసినట్లు పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி