జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ పెద్ద చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బుధవారం చెరువులో పోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంగపుత్రులు ఎమ్మెల్యేకి వారి సమస్యల వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈరోజు 60 వేల చేప పిల్లలను చెరువులో పోయడం జరిగిందని, చాలా మంచి కార్యక్రమం అన్నారు.