ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పోరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కోరుట్ల కాలనీలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ & జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారి వెంట, ఆర్డీవో శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ రాజు కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ ఉన్నారు.